Shoaib Malik: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. షోయబ్ మాలిక్‌పై వేటు
ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Shoaib Malik: పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ నుంచి అతన్ని తప్పించారు. ఫిక్సింగ్ అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను ఫార్చూన్ బరిషల్ రద్దు చేసింది. ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి.
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆయన సాధించిన అవార్డులు ఇవే
దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా స్పిన్నర్లు నోబాల్స్ వేయడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఓకే ఓవర్‌లో మూడు నో బాల్స్ వేయడం బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో కలకలం సృష్టించింది. నోబాల్స్ వివాదం ముదురుతున్న సమయంలో షోయబ్ మాలిక్ మెల్లగా జారుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫార్చూన్ బరిషల్.. అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. షోయబ్ మాలిక్ ఆట పరంగానే కాకుండా వ్యక్తిగత నిర్ణయాలతోనూ విమర్శలపాలయ్యాడు.
ఇటీవల మాలిక్.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నుంచి విడిపోయి పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్.. పాక్ తరపున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం పలు విదేశీ లీగ్స్‌లలో ఆడుతున్నాడు.