ఆర్సీబీ మహిళల జట్టుకు షాక్ ,క్రికెట్ కు సోఫీ డివైన్ బ్రేక్
న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ డివైన్ సేవలను కోల్పోనుంది. ఆమె ఎప్పుడు క్రికెట్ లోకి తిరిగి వస్తుందో మాత్రం చెప్పలేదు. మహిళల క్రికెట్ లో సోఫీ డివైన్ స్టార్ ప్లేయర్ గా గుర్తింపు పొందింది.
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఆమె ఎన్నో మ్యాచ్ ల్లో జట్టుకు విజయాలను అందించింది. డివైన్ క్రికెట్ కు దూరం కావడంతో డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ జట్టు తరపున డివైన్ ఓపెనర్ గా ఆడుతోంది. ఆమె స్థానంలో ఇప్పుడు మరొకరిని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది.