టీమిండియాకు షాక్, ప్రాక్టీస్ లో రాహుల్ కు గాయం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ కు ఊహించని షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2024 | 04:17 PMLast Updated on: Nov 15, 2024 | 4:17 PM

Shock For Team India Rahul Injured In Practice

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కే ఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతని కుడిచేతికి బలమైన గాయమైంది. దీంతో విలవిలలాడిన రాహుల్ బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్ తిరిగి కొనసాగించాలని మొదట భావించాడు. కానీ నొప్పి తీవ్రత, సుదీర్ఘ సిరీస్‌ దృష్ట్యా పెవిలియన్‌కు చేరాడు. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని భావిస్తున్నారు.

రాహుల్‌కు గాయమవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. కేఎల్ రాహుల్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 9 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 187 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే నెట్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో సర్ఫరాజ్ డిఫెన్స్ చేయలేకపోయాడు. దాంతో ఆ బంతి అతని మోచేతిని బలంగా తాకడంతో.. నొప్పితో బాధపడుతూ నెట్స్ నుంచి దూరంగా సర్ఫరాజ్ ఖాన్ వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ అతను బ్యాటింగ్‌కి రాలేదు. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ తొలి టెస్టులో ఆడలేకపోతే భారత్ జట్టుకి అది ఇబ్బందే అవుతుంది.

మిడిలార్డర్‌లో ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. వాస్తవానికి న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌కి తుది జట్టులో చోటు దక్కడం సులువే. కానీ.. ఇటీవల ఆస్ట్రేలియా పిచ్‌లపై ధ్రువ్ జురెల్ నిలకడగా ఆడాడు. ఆస్ట్రేలియా- ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో ధ్రువ్ అలవోకగా పరుగులు రాబట్టాడు. దాంతో సర్ఫరాజ్ స్థానంలో అతడ్ని ఆడించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. 2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్‌దే విజయం