ODI World Cup final : కప్పు గెలిచే వేళ.. షాకింగ్ కామెంట్స్
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ మర్చిపోకముందే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన మూడు రోజుల తర్వాత తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి ఇది మంచి అవకాశం అని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు జట్లలో ప్రధాన ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్ ఆడటం లేదు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ మర్చిపోకముందే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన మూడు రోజుల తర్వాత తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి ఇది మంచి అవకాశం అని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు జట్లలో ప్రధాన ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్ ఆడటం లేదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి వెటరన్ ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్ ఆడటం లేదు. ఆసీస్‌ది కూడా ఇదే పరిస్థితి. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ వంటి వాళ్లు ఒక మ్యాచ్ ఆడితే, మరో మ్యాచ్ ఆడటం లేదు. ఇక వార్నర్, హాజిల్‌వుడ్, స్టార్క్ వంటి బౌలర్లు అసలు ఈ సిరీస్ ఆడటం లేదు. ఇదంతా చూసిన చాలా మంది ఇలాగైతే అసలు ఈ సిరీస్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.
తాజాగా ఆసీస్ దిగ్గజ మైఖేల్ హస్సీ కూడా అదే మాట అన్నాడు. వరల్డ్ కప్ ముగిసిన రోజుల వ్యవధిలోనే టీ20 సిరీస్ మొదలవడం ఏమాత్రం బాగలేదన్నాడీ లెజెండ్. ‘ఈ టీ20 సిరీస్‌కు వాల్యూ లేకుండా పోయిందనే అనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల వరల్డ్ కప్ విలువ తగ్గదు. కానీ ఈ సిరీస్‌కు విలువ లేకుండా పోతుంది. రెండు జట్లలో వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లు చాలా మంది టీ20 జట్టులో కూడా ఉన్నారు. కానీ వాళ్లు వేరే సిరీసు కోసం రెడీ అవడానికో లేదంటే విశ్రాంతి కోసమే ఇంటికెళ్లి పోయారు’ అని హస్సీ గుర్తుచేశాడు. ఈ సిరీస్ లో బెస్ట్ ఆస్ట్రేలియా టీ20 టీం వెళ్లి బ్రెస్ట్ భారత టీ20 టీంను ఢీకొట్టడం లేదు కదా అన్నాడు. అలాగే మరీ ఇంత క్రికెట్ ఆడటం అంత మంచిది కూడా కాదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంత ఆడటం మానసికంగా, శారీరకంగా చాలా అలసట కలిగిస్తుందని చెప్పాడు.