ఓపెనర్‌గా రావాల్సిందేనా ? హిట్ మ్యాన్ పైనే అందరి ఫోకస్
అడిలైడ్‌లో డే-నైట్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 6వ నంబర్ బ్యాటింగ్ ఆర్డర్ ఫలించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 రెండో ఇన్నింగ్స్ ల్లో 6 పరుగులు చేసి వెనుదిరిగాడు.
అడిలైడ్‌లో డే-నైట్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 6వ నంబర్ బ్యాటింగ్ ఆర్డర్ ఫలించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 రెండో ఇన్నింగ్స్ ల్లో 6 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇది హిట్ మ్యాన్ ఆడాల్సిన ఆట కాదని మనందరికీ తెలుసు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే రోహిత్ ఇప్పుడు బంతుల్ని ఎదుర్కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. పుల్ షాట్స్ ని సునాయాసంగా బాదే శర్మ గత మ్యాచ్ లో ఎలా ఇబ్బంది పడ్డాడో చూశాం. డగౌట్ లో పడాల్సిన బంతి రోహిత్ హెల్మెట్ కి తగిలింది.ప్రస్తుతం రోహిత్ సాధారణ బంతులు ఎదుర్కోవడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు.
అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఓ కారణమని భావిస్తున్నారు. నిజానికి కేఎల్ రాహుల్ కూడా ఓపెనింగ్ అర్దర్లో పెద్దగా రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన కేఎల్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే గబ్బా టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చుడొచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో రోహిత్ యశస్వితో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలా లేదా పెర్త్‌లో విజయవంతమైన రాహుల్-యశస్వి జోడిని బరిలోకి దించాలా అన్నది సవాలుగా మారింది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మాత్రం గబ్బాలో కెప్టెన్ రోహిత్ ని ఓపెనర్గా చూడాలనుకుంటున్నారు. మరి రోహిత్ ఓపెనర్ గా వస్తేనైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.
రోహిత్ మిడిల్ లో వస్తే బాగుటుందని మరికొందరు భావిస్తున్నారు. ఎందుకంటే పింక్ బాల్ ఆరంభంలో ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఆ సమయంలో బౌలర్లకు సహకరిస్తుంది. పైగా రోహిత్ ఇప్పుడు బౌలర్లను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ సమయానికి బంతి పాతబడితే ఆడడం సులభం అవుతుంది. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులో ఉంటుంది. కానీ అప్పటికి బౌలర్లు అలసిపోతారు. సో మిడిల్ లో రోహిత్ ఆడితే బెటర్ అంటున్నారు. ఇక ఈ ఏడాది రోహిత్ గణాంకాలు దారుణంగా ఉన్నాయి. రోహిత్ ఈ సంవత్సరం మొత్తం 12 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 23 ఇన్నింగ్స్‌లలో 597 పరుగులు మాత్రమే చేశాడు సగటు కేవలం 27.13 మాత్రమే అంతేకాదు తొమ్మిది సార్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు.