SHREYAS IYER: భారత్‌కు బిగ్‌షాక్.. మూడో టెస్టుకు స్టార్ క్రికెటర్ ఔట్
ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన వెన్నునొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల సర్జరీ చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు.
SHREYAS IYER: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరమవుతున్నట్టు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా అతడు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. వైజాగ్ టెస్టు అనంతరం టీమిండియా ఆటగాళ్ల లగేజ్‌ను మూడో టెస్టు జరిగే రాజ్‌కోట్‌కు తరలించారు. కానీ శ్రేయస్ అయ్యర్ లగేజ్‌ను మాత్రం తన ఇంటికి పంపించారని సమాచారం.
PV Narasimha Rao: తెలుగోడికి భారతరత్న.. పీవీ గురించి ఎవరికీ తెలియని విషయాలు..
ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన వెన్నునొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల సర్జరీ చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడికి కొన్ని వారాలు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలో అతడు ఎన్సీఏకి వెళ్తాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభం నుంచే గాయాలు భారత్‌ను వెంటాడుతున్నాయి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు.
ప్రస్తుతం వారిద్దరు ఎన్సీఏలో కోలుకుంటున్నారు. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టుకు అందుబాటులో వస్తారని ఆశిస్తున్నా, దానిపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ కూడా దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. ప్రస్తుత యువ బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే కాస్త అనుభవం ఎక్కువ ఉంది. కాగా రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ మొదలుకానుంది.