Shreyas Iyer: క్రాఫ్ మీద ఉన్న శ్రద్ధ కెరీర్ గ్రాఫ్ మీద పెట్టు.. ఫ్యాన్స్ సలహా..!
ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకుని వరల్డ్ కప్ జట్టులో ఎంపికైన అయ్యర్‌కి మరోసారి వెన్ను సమస్య పలకరించింది. అయితే అన్నింటిని దాటుకుని బెంగళూర్ NCAలో తీవ్రంగా శ్రమించి ఫిట్‌నెస్ నిరూపించుకుని ఆసియా కప్‌లో చోటు సంపాదించాడు.
Shreyas Iyer: సాధారణంగా ఒక ఆటగాడు గాయాన్ని బట్టి కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ శ్రేయస్ అయ్యర్‌కి మాత్రం కోలుకున్న ప్రతిసారి నిను వీడను నేను అంటూ గాయం తిరగబెడుతుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ఐపీఎల్ నుంచి క్రికెట్ ఆడడం లేదు. అయితే ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకుని వరల్డ్ కప్ జట్టులో ఎంపికైన అయ్యర్‌కి మరోసారి వెన్ను సమస్య పలకరించింది. అయితే అన్నింటిని దాటుకుని బెంగళూర్ NCAలో తీవ్రంగా శ్రమించి ఫిట్‌నెస్ నిరూపించుకుని ఆసియా కప్‌లో చోటు సంపాదించాడు.
ఫిట్‌నెస్ లేకుండా జట్టులో ఉంచుకోవడం కంటే ఆ స్థానంలో ఆ స్థానంలో టాలెంటెడ్ ప్లేయర్స్ తిలక్ వర్మ, సంజు శాంసన్‌లలో ఎవరికి అవకాశమిచ్చినా సద్వినియాగం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయ్యర్ తన జల్సాలకు ఇచ్చిన ప్రాముఖ్యం తన ఫిట్‌నెస్‌కి ఇవ్వడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పబ్బులో, క్లబులో కనబడుతున్న అయ్యర్‌లో టీమిండియాకు ఆడాలనే కసి ఉండటం లేదంటున్నారు. ఈ క్రమంలో చాహల్ భార్య ధనశ్రీతో అయ్యర్ చేసిన బాగోతం అందరికీ తెలిసిందే.
చాహల్ భార్య ధనశ్రీతో సరదాగా డ్యాన్స్ వేస్తూ కనిపించిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి అయ్యర్ ఇంకెంతకాలం జట్టులో టైమ్ పాస్ చేస్తాడో చూడాలి అంటూ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా అతని పెర్ఫామెన్స్ మీద పెదవి విరుస్తున్నారు.