Shreyas Iyer: అట్లుంటది మాతోని.. స్టోక్స్‌పై శ్రేయస్ అయ్యర్ రివేంజ్
తమను ట్రోల్ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు ఆటగాళ్లు. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో అదే పని చేశాడు.
Shreyas Iyer: రెండు టాప్ టీమ్స్ మధ్య పోటీ అంటే క్రికెట్ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తే. మైదానంలో ఆటగాళ్లు కూడా విజయం కోసం కాస్త గట్టిగానే పోరాడతారు. తమను ట్రోల్ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్‌కు కౌంటర్ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు ఆటగాళ్లు. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో అదే పని చేశాడు.
Rohit sharma: రోహిత్‌కు కోపమొచ్చింది.. అంపైర్ నిర్ణయంపై అసహనం
వైజాగ్‌లో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్లీ బౌలింగ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో స్టోక్స్ అయ్యర్‌కు సెండాఫ్ ఇస్తూ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్న తీరు అతడికి కోపం తెప్పించింది. అయితే అందుకు బదులు తీర్చుకునే అవకాశం అయ్యర్‌కు నాలుగో రోజు వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ సింగిల్ తీశాడు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న బెన్ స్టోక్స్ పరుగు తీయడంలో బద్దకం ప్రదర్శించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అయ్యర్ వికెట్లకు డైరెక్ట్‌గా త్రో చేయగా.. స్టోక్స్ రనౌట్ అయ్యాడు.
దీంతో శ్రేయస్ అయ్యర్ సైతం.. స్టోక్స్ తన క్యాచ్ అందుకున్నపుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో అదే తరహాలో వేలు చూపిస్తూ తిరిగి చెల్లించేశాను అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి ఫొటోలను కలిపి షేర్ చేస్తున్న టీమిండియా అభిమానులు మా వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏదీ దాచుకోరు. తిరిగి ఇచ్చేస్తారు అంటూ ఇంగ్లండ్ ప్లేయర్లపై సెటైర్లు వేస్తున్నారు.