BCCI AWARDS: కన్నుల పండుగగా బీసీసీఐ అవార్డులు.. మెరిసిన స్టార్ క్రికెటర్లు

గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 01:25 PMLast Updated on: Jan 24, 2024 | 1:25 PM

Shubman Gill And Deepti Sharma Win Big At Bcci Awards

BCCI AWARDS: బీసీసీఐ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్‌ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌.. అరుదైన రికార్డును నెలకొల్పాడు. రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

Sania comments on Shoib: షోయబ్ కు అమ్మాయిల పిచ్చి.. అందుకే వదిలేసా ! సానియా సంచలన నిజాలు

ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. ఇక 2019-2020 ఏడాదికిగాను మహ్మద్‌ షమీ.. 2020-2021 ఏడాదికిగాను అశ్విన్‌.. 2021-2022 ఏడాదికిగాను బుమ్రా పాలి ఉమ్రిగర్‌ అవార్డులు అందుకున్నారు. 2019లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన షమీ టెస్టు క్రికెట్ లో 33 వికెట్లు , వన్డే క్రికెట్లో 21 మ్యాచ్ లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. మహిళల విభాగంలో స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళ క్రికెటర్‌ అవార్డును గెలుచుకున్నారు. 2020-21, 2021-22 ఏడాదులకుగాను స్మృతి మంధాన, 2019-2020, 2022-23 సీజన్‌లకుగాను దీప్తి శర్మ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ అవార్డును అందుకున్నారు. మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, ఫరూఖ్‌ ఇంజినీర్‌.. సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు. టీమిండియా తరఫున రవిశాస్త్రి 80 టెస్టులు ఆడి 3,830 పరుగులు చేశాడు. అలాగే 150 వన్డేల్లో 3,108 రన్స్‌ చేశాడు.

టెస్టుల్లో 151 వికెట్లు తీసిన ఈ దిగ్గజ ఆల్‌రౌండర్‌.. వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. 2014 లో భారత క్రికెట్‌ జట్టుకు టీమ్‌ డైరెక్టర్‌గా ఉన్న శాస్త్రి.. 2016 తర్వాత పూర్తిస్థాయి కోచ్‌ బాధ్యతలు స్వీకరించాడు. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో రవిశాస్త్రి కోచింగ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి దేశాలపై టీమిండియా గెలిచింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్‌.. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్‌లను సాధించింది.