SHUBMAN GILL: గిల్‌కు బీసీసీఐ అవార్డు.. కోహ్లీని దాటి మరీ..

కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ గిల్ అదరగొడుతున్నాడు. గతేడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48 మ్యాచ్‌ల్లో 46 సగటుతో 2154 పరుగులు చేశాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2024 | 03:57 PMLast Updated on: Jan 23, 2024 | 3:58 PM

Shubman Gill And Ravi Shastri To Be Honoured At Bcci Awards

SHUBMAN GILL: బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ఈ సారి హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ అవార్డుల జాబితాలో పలువురు యువ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ పురస్కారానికి యువ ఓపెనర్ శుభమన్ గిల్ ఎంపికైనట్టు తెలుస్తోంది. 2023సీజన్‌కు సంబంధించి అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లకు ఈ అవార్డునిచ్చి సత్కరిస్తారు. కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ గిల్ అదరగొడుతున్నాడు.

Virat Kohli: కోహ్లీ రీప్లేస్‌మెంట్ ఎవరు.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..

గతేడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48 మ్యాచ్‌ల్లో 46 సగటుతో 2154 పరుగులు చేశాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన కోహ్లికే బీసీసీఐ వార్షిక అవార్డు లభిస్తుందని అంతా భావించినప్పటకీ.. వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన గిల్‌ను ఉత్తమ క్రికెటర్‌ అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే మాజీ ఆటగాళ్లకు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తారు. దీనికి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంపికైనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఉమెన్స్ విభాగంలో ఉత్తమ క్రికెటర్ అవార్డు ఎవరికి దక్కుతుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

కాగా, బీసీసీఐ అవార్డుల ఫంక్షన్‌కు టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు హాజరు కానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.