Shubman Gill: గిల్ అరుదైన రికార్డు.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గుజరాత్ కెప్టెన్

గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఈ మార్క్ ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకోగా.. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు గిల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2024 | 02:02 PMLast Updated on: Apr 11, 2024 | 2:03 PM

Shubman Gill Creates History Breaks Virat Kohlis Record In Ipl

Shubman Gill: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు శుభ్‌మన్ గిల్. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే 3000 వేల పరుగులు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

Kuldeep Sen: మొదట హీరో.. తర్వాత విలన్.. రాజస్థాన్ కొంపముంచిన కుల్దీప్ సేన్

గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ ఈ మార్క్ ను 26 ఏళ్ల 186 రోజుల్లో అందుకోగా.. తాజాగా ఈ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు గిల్. లిస్ట్‌లో వీరిద్దరి తర్వాత సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు. దీంతో పాటుగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఇన్నింగ్స్‌ల పరంగా 3000 రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో చేరాడు గిల్. 94 ఇన్నింగ్స్‌‌ల్లో గిల్ ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 75 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 197 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ చివరి బంతికి ఛేదించి, మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.