Shubman Gill: గిల్ ఈ పిచ్‌లపై ఆడలేడా..? ఫాం కోల్పోయాడా..? అలాంటి బంతికే ఔటైతే ఎలా..?

ఇండియా అన్నది బ్యాటింగ్‌ మోజు ఉన్న కంట్రీ. ఇక్కడ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం బ్యాటింగ్‌ ట్రాక్‌లే తయారు చేస్తారు.. అక్కడ ఆడినంత మాత్రానా అంతర్జాతీయ స్థాయిలో మెరవాలని లేదు. గిల్‌ విషయం చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2023 | 05:20 PMLast Updated on: Sep 03, 2023 | 5:20 PM

Shubman Gill Flops In 1st Match Vs Pakistan Fans Slams Opener For Playing More Dot Balls

Shubman Gill: ఐపీఎల్‌లో ఆట చూసి సచిన్‌, కోహ్లీ అంటూ గిల్‌ని ఆకాశానికి ఎత్తడం అట్టర్‌ నాన్‌సెన్స్‌. ఈ విషయం ప్రూవ్‌ అవ్వడానికి ఎక్కువ టైమ్‌ కూడా పట్టలేదు. ఇప్పటికే విండీస్‌ గడ్డపై అట్టర్‌ఫ్లాప్‌ అయిన గిల్‌.. ఆసియా కప్‌లో పాక్‌పై పోరులోనూ తుస్సుమన్నాడు. 150 ప్లస్ కిలోమీటర్ల వేగంతో అక్తర్‌ వేసిన బంతులను స్టాండ్స్‌లోకి పంపించిన సచిన్‌తో 143 కిలోమీటర్ల వేగాన్ని చూసి భయపడే గిల్‌ని పోల్చడం ఎంత విడ్డూరం. ఐపీఎల్‌ అన్నది చాలా మంది యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ని నిరూపించుకునే లీగ్‌. టోర్ని మొత్తం బ్యాటింగ్‌ ట్రాక్‌లపైనే జరుగుతాయి. దీంతో యువ బౌలర్లు ఘోరంగా పరుగులు సమర్పించుకుంటారు.. బ్యాటర్లు ఈజీగా రన్స్‌ చేసుకుని లైమ్‌ లైట్‌లోకి వస్తారు. గిల్‌ కూడా అలానే పాపులర్‌ అయ్యాడు. డొమెస్టిక్‌ క్రికెట్‌లోనూ గిల్‌ సత్తా చాటినా.. అక్కడ కూడా అంతర్జాతీయ బౌలింగ్‌ స్టాండర్డ్స్‌ ఉండవు కదా. ఇండియా అన్నది బ్యాటింగ్‌ మోజు ఉన్న కంట్రీ. ఇక్కడ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం బ్యాటింగ్‌ ట్రాక్‌లే తయారు చేస్తారు.. అక్కడ ఆడినంత మాత్రానా అంతర్జాతీయ స్థాయిలో మెరవాలని లేదు. గిల్‌ విషయం చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో గిల్ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ పిచ్‌పై గిల్‌ నిలబడి ఉన్నాడంటే ప్రత్యర్థుల్లో వణుకు పుట్టేది. క్లాసిక్‌ షాట్స్‌ ఆడుతూ బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. గుజరాత్ జట్టుకు మరుపురాని విజయాలను అందించాడు. ఏకంగా సెంచరీలు బాదాడు. గుజరాత్ ఫైనల్‌ వరకు రావడానికి గిల్‌ ప్రధాన కారణం. దీంతో గిల్‌పై అన్నివైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు అని అందరూ పొడిగారు. అతని టాలెంట్‌, టెక్నిక్‌ నిజంగా అద్భుతంగా అనిపించాయి. అయితే విదేశీ గడ్డలపై రాణించిన తర్వాతే ఏ బ్యాటర్‌పైనైనా ఓ అంచనాకు రావడం బెటర్‌. ప్రస్తుతం గిల్ ఆట తీరు చూస్తుంటే అతని విషయంలో అందరూ కాస్త ఆవేశపడినట్టే అనిపిస్తోంది.
ఐపీఎల్‌ తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్, విండీస్ టూర్‌లో గిల్ ఘెరంగా ఆడాడు. విండీస్‌పై ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వెస్టిండీస్‌ బౌలింగ్‌ అంతంతమాత్రంగానే ఉంది. వన్డే వరల్డ్‌కప్‌కి కూడా క్వాలిఫై అవ్వని జట్టు అది. కానీ మ్యాచ్‌లు జరిగింది విండీస్‌లో. అందుకే మనోడు ఆడలేకపోయినట్టు ఉన్నాడు. అయినా కూడా గిల్‌పై పెద్దగా విమర్శలు రాలేదు. ఒక్క సిరీస్‌కి విమర్శించాల్సిన అవసరం లేదు కూడా. అయితే ఆసియా కప్‌లో పాక్‌పై మ్యాచ్‌లో మాత్రం గిల్ ఆడిన తీరు అందరిని షాక్‌కి గురి చేసింది. 32 బంతులు ఆడి సింగిల్స్‌ రోటేట్ చేయకుండా జిడ్డు ఆడుతూ నిలబడ్డాడు. కేవలం 10 పరుగులే చేశాడు. అవతలి ఎండ్‌లోని బ్యాటర్లపై ఒత్తిడి పెరిగేలా చేశాడు. రోహిత్, కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్‌ రన్‌ రేట్ పెంచే ప్రయత్నంలోనే వికెట్ పారేసుకున్నాడు. ఇలా పరోక్షంగా టాప్‌ ప్లేయర్ల ఫ్లాప్‌ షోకి గిల్ కారణమయ్యాడు. పోనీ.. తర్వాతైనా నిలబడి పరుగులు చేశాడా అంటే అదీ లేదు. 147 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన రౌఫ్‌ బంతిని డిఫెండ్ చేయడంలో బోల్తా పడి పెవిలియన్‌కి చేరాడు.