Shubman Gill: సచిన్ కూతురుతో శుభ్‌మన్‌గిల్.. కెమెరాకు చిక్కిన ప్రేమజంట..

డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌ సారా టెండుల్కర్‌తో కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 03:28 PMLast Updated on: Nov 01, 2023 | 3:28 PM

Shubman Gill Sara Tendulkar Spotted Together Amidst Dating Rumours

Shubman Gill: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది టీమిండియా. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖడె స్టేడియం దీనికి వేదిక కానుంది.

మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ ఇప్పటికే ముంబై చేరుకున్నాయి. వాంఖడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో గడుపుతున్నాయి. శ్రీలంకపై గెలవడం వల్ల తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కుప్టెన్ రోహిత్ శర్మ.. ఈ దిశగా జట్టును సమాయాత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌ సారా టెండుల్కర్‌తో కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శుభ్‌మన్ గిల్ టీషర్ట్, దానిపై బ్లాక్ కలర్ జీన్స్ వేసుకోగా.. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది సారా టెండుల్కర్. తమ కామన్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఎంట్రన్స్ వద్దే ఆమె ఆగిపోగా.. గిల్ మాత్రం ఓ రెస్టారెంట్ నుంచి ముందుగా బయటికి రావడం, అతని వెనకే ఉన్న సారా టెండుల్కర్.. ఎంట్రన్స్ వద్దే నిలిచిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. దీని మీద మీమ్స్ మొదలయ్యాయి అప్పుడే. లవ్ బర్డ్స్ ముంబైలో చక్కర్లు కొడుతున్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.