యుఎస్ ఓపెన్ విజేత సిన్నర్ తొలి ఇటలీ ప్లేయర్ గా రికార్డ్

ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను జానిక్ సిన్నర్ కైవసం చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 05:40 PMLast Updated on: Sep 09, 2024 | 5:40 PM

Sinner Becomes The First Italian Player To Win The Us Open

ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను జానిక్ సిన్నర్ కైవసం చేసుకున్నాడు. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ అయిన సిన్నర్ ఫైనల్లో 6-3, 6-4, 7-5 స్కోర్ తో అమెరికన్ ప్లేయర్ టేలర్ ఫ్రిడ్జ్ పై విజయం సాధించాడు. రెండు గంటల పాటు సాగిన టైటిల్ పోరులో సిన్నర్ ఆధిపత్యం కనబరిచాడు. తొలి రెండు సెట్లలో సర్వీస్ కోల్పోయిన టేలర్ మూడో సెట్ లో కాస్త పోటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విజయంతో యుఎస్ ఓపెన్ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్ గా సిన్నర్ చరిత్ర సృష్టించాడు. సిన్నర్ కెరీర్ లో ఇది తొలి యుఎస్ ఓపెన్.. అలాగే రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్… ఈ ఏడాది సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచాడు.