సీరియల్ యాక్టర్‌తో సిరాజ్ లవ్?
టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ లవ్ లైఫ్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో సిరాజ్ లవ్‌లో ఉన్నాడంటూ రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను సిరాజ్ జానాయ్ ఇద్దరూ కొట్టిపారేశారు.

టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ లవ్ లైఫ్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో సిరాజ్ లవ్‌లో ఉన్నాడంటూ రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను సిరాజ్ జానాయ్ ఇద్దరూ కొట్టిపారేశారు. పైగా జానాయ్ నా చెల్లెలి లాంటిది అంటూ సిరాజ్ పోస్ట్ కూడా పెట్టాడు. దీంతో ఆ రూమర్స్‌కు అక్కడితో చెక్ పడింది. కానీ ఇప్పుడు సిరాజ్ బిగ్‌బాస్ 13 బ్యూటీ మహిరా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సిరాజ్, మహిరా సన్నిహితులు సైతం వారి ప్రేమను కన్ఫాం చేసినట్లుగా టాక్ నడుస్తోంది.
తన లవ్ లైఫ్ గురించి రీసెంట్‌గా వచ్చిన రూమర్స్‌ను వెంటనే ఖండించిన సిరాజ్ ఇప్పుడు మాత్రం అసలు రియాక్ట్ కాకపోవడంతో మహిరాతో రిలేషన్ నిజమేనని అంటున్నారు. కానీ ఈ విషయంలో మహిరా నుంచి సిరాజ్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే రాలేదు. జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిరా చాలా పంజాబీ సినిమాల్లో నటించింది. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. నాగిన్, బెపనా ప్యార్, కుండలి భాగ్య లాంటి సిరీయల్స్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిరాజ్, మహిరాల మధ్య గతేడాది నవంబర్‌లో ప్రేమ కథ మొదలైనట్లుగా తెలుస్తోంది.
మహిరాకు చెందిన పలు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, పోస్టులకు సిరాజ్ లైక్ చేశాడు. అంతేకాకుండా వీళ్లిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. నార్మల్‌గా సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి రూమర్స్ చాలా కామన్. చాలా మంది వీటిని చాలా లైట్‌గా కొట్టిపారేస్తుంటారు కూడా. కానీ కొందరు మాత్రం వీటికి రియాక్ట్ అయ్యి ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇస్తుంటారు. రీసెంట్‌గా జానాయా విషయంలో సిరాజ్ అదే చేశాడు. కానీ ఇప్పుడు మహిరా విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. దీంతో ఈమే మా వదిన అంటున్నారు సిరాజ్ ఫ్యాన్ బ్రదర్స్. మరి ఈ విషయంలో సిరాజ్ గుడ్‌న్యూస్ చెప్తాడా లేక ఈమె కూడా నాకు చెల్లలే అంటాడా చూడాలి.