నన్ను చావదొబ్బకండి మహిరాతో డేటింగ్ నిజం కాదు

టీమిండియా క్రికెటర్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన గాళ్స్ తో డేటింగ్స్ చేయడం, లవ్ ఎఫైర్స్ నడపడం కామనే... సెలబ్రిటీలు కావడంతో క్రికెటర్ తో ఏ హీరోయిన్ కనిపించినా ఏదో ఒక రుమార్ వస్తూనే ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 04:30 PMLast Updated on: Mar 22, 2025 | 4:30 PM

Siraj Reacts On Love Story Rumors

టీమిండియా క్రికెటర్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన గాళ్స్ తో డేటింగ్స్ చేయడం, లవ్ ఎఫైర్స్ నడపడం కామనే… సెలబ్రిటీలు కావడంతో క్రికెటర్ తో ఏ హీరోయిన్ కనిపించినా ఏదో ఒక రుమార్ వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పైనా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. బిగ్ బాస్ 13 లో పాల్గొన్న తరువాత ఫేమ్ సంపాదించిన మహీరాతో మహ్మద్ సిరాజ్ ప్రేమాయణం గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మహీరా, సిరాజ్ రొమాంటిక్ గా ఉన్నారని కొంతకాలం కిందట ఈ-టైమ్స్ రిపోర్ట్ చేసింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయని కథనాన్ని ప్రచురించింది. వారు తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది.మహీరా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లలో ఒకదాన్ని సిరాజ్ లైక్ చేయడంతో డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ ప్లాట్ ఫామ్ లో ఒకరినొకరు ఫాలో అయ్యారు. దీంతో వీరి రొమాన్స్ పై అభిమానులు పుకార్లు మొదలుపెట్టారు. ఇంతకుముందు మహీరా, ఆమె తల్లి ఇద్దరూ ఈ పుకార్లను ఖండించారు.

మహీరా ఎక్కడ కనిపించినా.. ఆమెను ఈ డేటింగ్ ప్రశ్నలే అడుగుతున్నారు. దీనిపై తాజాగా సిరాజ్ స్పందించాడు. ఈ డేటింగ్ వార్తల్లో నిజం లేదని, తన గురించి తరచూ ఆమెను ప్రశ్నలు అడిగి విసిగించొద్దని మీడియాను కోరుతున్నాడు. మహీరా శర్మ ఇటీవలే ఓ అవార్డు వేడుకలో పాల్గొని రాబోయే ఐపీఎల్ గురించి, తనకు ఇష్టమైన జట్టు గురించి సరదాగా మాట్లాడింది. ఈ సందర్బంగా సిరాజ్ గురించి అడుగుతూ ఆమెను ఆటపట్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిరాజ్ తన ఇన్‌స్టా వేదికగా స్పందించాడు. తన గురించి ఇతరులను ప్రశ్నించవద్దని ఫోటోగ్రాఫర్లను కోరాడు. అయితే తన పోస్ట్ లో ప్రత్యేకంగా ఎవరి గురించి ప్రస్తావించలేదు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సిరాజ్ తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. ఇది పూర్తిగా అవాస్తవం, నిరాధారమని చెప్పాడు. ఇక్కడితో ఇది ముగుస్తుందని ఆశిస్తున్నా అంటూ ఓ ఎమోజీతో పాటు పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే సిరాజ్‌ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్‌ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇటీవల మహిరాశర్మ కూడా సిరాజ్ తో స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్‌ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. మహీరా శర్మ తారక్ మెహతా కా ఊల్టా చష్మాలో ఒక చిన్న పాత్రతో తన కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత నాగిన్ 3, కుండలి భాగ్య, బేపనా ప్యార్ వంటి అనేక టీవీ షోలలో నటించింది. అయితే సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొనడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. గతంలో మహీరా పరాస్ చాబ్రాతో రిలేషన్షిప్ లో ఉంది. బిగ్ బాస్ 13లో కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే 2023లో విడిపోయారు. మరోవైపు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సీజన్ నుంచి సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేలానికి ముందే అతన్ని ఆర్సీబీ వదిలేయడంతో గుజరాత్ 12 కోట్లకు దక్కించుకుంది.