MS Dhoni : ఒంటి చేత్తో సిక్సర్లు.. ధోనీనా మజాకా
గుజరాత్ (Gujarat) తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓడిపోయినా ధోనీ బ్యాటింగ్ చివర్లో ఫాన్స్ కి మజా ఇచ్చింది.ఆఖర్లో బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ (Dhoni) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
గుజరాత్ (Gujarat) తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓడిపోయినా ధోనీ బ్యాటింగ్ చివర్లో ఫాన్స్ కి మజా ఇచ్చింది. ఆఖర్లో బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ (Dhoni) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో రెండు సార్లు బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. అలాగే హెలికాఫ్టర్ షాట్‌తో మరో సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 1063 సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండో సీజన్‌గా ఐపీఎల్ 2024 సీజన్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2022 సీజన్ అత్యధిక సిక్సర్ల రికార్డును ఈ సీజన్ బ్రేక్ చేసింది. అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్ల జాబితాలో ఐపీఎల్ 2023 అగ్రస్థానంలో ఉంది. 2023లో 1124 సిక్స్ లు ఉన్నాయి. ప్రస్తుత సీజన్ లో బ్యాటర్ల జోరు చూస్తుంటే ఆ రికార్డు కూడా బద్దలవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలాలేదు. ఐపీఎల్ 17 ఐపీఎల్ సీజన్లలో చివరి మూడు సీజన్లలో మాత్రమే 1000 ప్లస్ సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు 2018లో 872 సిక్సర్లు టాప్‌గా ఉండేది.