స్మిత్ @10,000 టెస్టుల్లో అరుదైన రికార్డు
ఫార్మేట్ ఏదైనా రఫ్ఫాడించాల్సిందే. తక్కువ బంతులకు ఎక్కువ పరుగులు చేస్తేనే మజా వస్తుందేమో. టెస్టు అయినా ఐపీఎల్ అయినా ఉతికారేయాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు స్టీవ్ స్మిత్ గురించే. ఏ ఫార్మాట్‌లోనైనా బౌలర్లను
ఫార్మేట్ ఏదైనా రఫ్ఫాడించాల్సిందే. తక్కువ బంతులకు ఎక్కువ పరుగులు చేస్తేనే మజా వస్తుందేమో. టెస్టు అయినా ఐపీఎల్ అయినా ఉతికారేయాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు స్టీవ్ స్మిత్ గురించే. ఏ ఫార్మాట్‌లోనైనా బౌలర్లను చిత్తు చేయడం అతని స్పెషాలిటీ. శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో ఈ స్టార్ బ్యాటర్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు గాలె టెస్టు తొలిరోజు చిరస్మరణీయంగా మారింది. ఎందుకంటే తొలి పరుగు చేసి టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నిజానికి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ సమయంలో స్టీవ్ స్మిత్ 10,000 టెస్ట్ పరుగుల మార్క్‌ను తాకడానికి కేవలం 1 పరుగు దూరంలో నిలిచాడు. ఇప్పుడు శ్రీలంకపై తొలి పరుగు చేసి టెస్టులో 10,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలిచాడు. 115వ టెస్టులో 205వ ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు.
స్టీవ్ స్మిత్ కంటే ముందు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 10,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లు అలెన్ బోర్డర్, స్టీవ్ స్మిత్ మరియు రికీ పాంటింగ్. బోర్డర్ 1978 మరియు 1994 మధ్య 156 టెస్టుల్లో 265 ఇన్నింగ్స్‌లలో 11,174 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. 1985 మరియు 2004 మధ్య, స్టీవ్ వా 168 టెస్టుల్లో 260 ఇన్నింగ్స్‌లలో 10,927 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రికీ పాంటింగ్. 1995 మరియు 2012 మధ్య, అతను 168 టెస్టుల్లో 13,378 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 41 సెంచరీలు నమోదయ్యాయి.