శ్రీలంకతో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్మిత్
ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు మళ్ళీ జట్టు సారథ్య బాధ్యతలు దక్కాయి. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.
ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు మళ్ళీ జట్టు సారథ్య బాధ్యతలు దక్కాయి. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ కు దూరమయ్యాడు. కాగా 16 మందితో కూడిన జట్టుకు ట్రావిస్ హెడ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా అండర్19 క్రికెట్ ప్రపంచ కప్ మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీ తొలిసారి టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకలో జరగబోయే ఈ సిరీస్ కు స్పిన్నర్లు కీలకం కానుండడంతో మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టులకు దూరమైన యువ ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీకి కూడా చోటు దక్కింది.