Smriti Mandhana: లవర్‌తో కలిసి ఫోజులు.. ట్రోఫీ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ హంగామా
కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Smriti Mandhana: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. ట్రోఫీని అందుకోవాలనే 16 ఏళ్ల ఆర్సీబీ ఫ్రాంచైజీ కలను అమ్మాయిలు నెరవేర్చారు. అయితే మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
Sarfaraz Khan: ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న సర్ఫరాజ్.. చిచ్చర పిడుగుపై కన్నేసిన ఫ్రాంచైజీలు
విజయాన్ని ఆస్వాదించారు. కాగా, కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడైన పలాష్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. ఓ ఈవెంట్‌లో పలాష్-స్మృతి మంధానకు ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది.
ఒకరినొకరు అభినందించుకుంటూ సోషల్ మీడియాలో వారిద్దరు తరుచూ పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా ట్రోఫీతో స్మృతితో కలిసి దిగిన ఫొటోను పలాష్ ముచ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి స్మృతి మంధాన కూడా బదులిచ్చింది. బ్లాక్ హార్ట్ లవ్ సింబల్స్‌తో స్మృతి కామెంట్ పెట్టింది. దీంతో ఇద్దరూ లవ్ లో ఉన్నట్టేనంటూ ఫాన్స్ చర్చించుకుంటున్నారు.