Rishabh Pant: వరల్డ్‌కప్ జట్టులో పంత్‌కు ఛాన్సుందా..? దాదా ఏమన్నాడంటే
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు.

Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు ఏడాదిన్నర తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సేవలు అందిస్తున్నాడు. దీంతో పంత్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది.
VIRAT KOHLI: సెంచరీ చేసినా విమర్శలే.. కోహ్లీపై మండిపడుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్ బెర్తులు ఖరారు కానున్నాయి. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ ఇప్పటికే రేసులో ముందండగా.. పంత్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ వరల్డ్‌కప్ సెలక్షన్ గురించి బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ జట్టులో పంత్ చోటు దక్కించుకోగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇంకొన్ని మ్యాచ్‌లు పూర్తయితే క్లారిటీ వస్తుందన్నాడు. ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడనీ, బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడని చెప్పాడు. సెలక్టర్లు పంత్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేననీ, ప్రస్తుతానికి పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని గంగూలీ చెప్పుకొచ్చాడు.
కాగా డిసెంబరు, 2022లో పంత్ ప్రమాదానికి గురయ్యాడు. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషభ్ పంత్ రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింటిలో ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది.