World Cup 2023: ప్రపంచ కప్‌లో స్పిన్నర్లే విన్నర్లు.. సత్తా చాటుతున్న బౌలర్లు..!
1987, 1996, 2011లో ఉపఖండం వేదికగా ప్రపంచకప్‌లు జరిగాయి. ఆ టోర్నీలన్నింట్లో స్పిన్నర్లు జోరు చూపించారు. 2011 ప్రపంచకప్‌లో పడ్డ మొత్తం బంతుల్లో 47 శాతం స్పిన్నర్లు వేసినవే. వికెట్లలో కూడా 44 శాతం వాటా స్పిన్నర్లు తీసుకున్నారు.
World Cup 2023: ఉపఖండంలో ఎప్పుడు ప్రపంచకప్ జరిగినా స్పిన్నర్లదే హవా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్ వేదికగా మొదలైన 2023 ప్రపంచకప్ కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత్ – ఆస్ట్రేలియా వన్డే సిరీస్ చూసినా.. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్‌లను గమనించినా స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు కాబోతున్నారని అర్థమైపోతుంది. ప్రపంచకప్ ఆరంభ పోరు ఈ అభిప్రాయాన్ని మరింత పెంచింది. 1987, 1996, 2011లో ఉపఖండం వేదికగా ప్రపంచకప్‌లు జరిగాయి.
ఆ టోర్నీలన్నింట్లో స్పిన్నర్లు జోరు చూపించారు. 2011 ప్రపంచకప్‌లో పడ్డ మొత్తం బంతుల్లో 47 శాతం స్పిన్నర్లు వేసినవే. వికెట్లలో కూడా 44 శాతం వాటా స్పిన్నర్లు తీసుకున్నారు. భారత్‌లో మెజారిటీ స్టేడియాలు స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. సొంత జట్టు బలానికి తగ్గట్లు, పిచ్‌ల సహజ స్వభావానికి అనుగుణంగానే వికెట్లు తయారు చేస్తారు. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్లే విన్నర్లు అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత స్పిన్ బౌలర్లు కూడా తమ బంతితో మాయాజాలం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచులు స్పిన్నర్లు రవిచంద్ర అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా సత్తా చాటిన సంగతి తెలిసిందే.