వినేశ్ ఫొగట్ కు ఊరట సిల్వర్ మెడల్ రికమెండ్ చేసిన కోర్టు

vinesh phogat
బరువు పెరిగిందన్న కారణంతో చివరి నిమిషంలో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ కు ఊరట దక్కింది. పారిస్ క్రీడా కోర్టు వినీశ్ పిటిషన్ ను విచారించింది. ఆమె రెండో స్థానంలో నిలిచిన రెజ్లర్ కు ఇచ్చే రజతం కోసం క్లెయిమ్ చేయొచ్చని అభిప్రాయపడింది. చివరి నిమిషంలో అనర్హత వేటు వేయడం , తర్వాత సమయం కావాలని కోరినా అధికారులు నిరాకరించడం వంటి అంశాలను వినేశ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పటికే ఫైనల్ కు చేరిన మరో రెజ్లర్ కు గోల్డ్ మెడల్ ఖాయం చేసిన నేపథ్యంలో రెండో స్థానంలో తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని న్యాయస్థానాని కోరింది. వినేశ్ వాదనలతో ఏకీభవిస్తూ సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయొచ్చని పేర్కొంది.