కోల్ కత్తా కు బిగ్ షాక్ రూ.23 కోట్ల ప్లేయర్ కు గాయం
ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్స్ తో ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. అదే సమయంలో తమ స్టార్ ప్లేయర్స్ గురించి ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి.
ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్స్ తో ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. అదే సమయంలో తమ స్టార్ ప్లేయర్స్ గురించి ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి. ఎవరూ గాయలపాలు కాకుండా ఉండాలంటూ కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డాడు. కేరళ జట్టుతో రంజీ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడి కాలి చీలమండకు గాయమైంది.మూడు బంతులు ఎదుర్కోగానే అతడి గాయం తగిలింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడుతూ కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమిలేక అతడు మైదాన్ని వీడాల్సి వచ్చింది.
ఈ గాయం వల్ల అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెంకటేశ్ అయ్యర్ గాయం కోల్ కత్తా ఫ్రాంచైజీని టెన్షన్ పెడుతోంది. గత సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అతడే కీలకంగా వ్యవహరించాడు. దీంతో మెగా వేలంలో 23.75 కోట్లు భారీ ధర వెచ్చించి మరీ వెంకటేశ్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అందుకే అతడికి గాయం త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటోంది. వెంకటేశ్ అయ్యర్ గత సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి 370 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో 50 మ్యాచ్ లలో 1350 పరుగులు చేశాడు. దీనిలో 11 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. వచ్చే సీజన్ లో కోల్ కత్తా కెప్టెన్ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.