కంగారూలకు షాక్ మీద షాక్, మెగాటోర్నీకి స్టార్క్ దూరం
ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండగా.. అన్ని జట్లనూ ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతున్నాయి. అయితే మిగిలిన జట్లతో పోలిస్తే టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండగా.. అన్ని జట్లనూ ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతున్నాయి. అయితే మిగిలిన జట్లతో పోలిస్తే టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ మెగా టోర్నీకి జట్టును ప్రకటించినప్పటి నుంచి ఒక్కొక్క ఫాస్ట్ బౌలర్ దూరమవుతూనే ఉన్నాడు. ఏకంగా ఐదుగురు కీలక ఆటగాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే కమ్మిన్స్ , హ్యాజిల్ వుడ్, మిఛెల్ మార్ష్ , స్టోయినిస్ దూరమవగా… ఆ జాబితాలో మిఛెల్ స్టార్క్ కూడా చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఈ స్టార్ పేసర్ మెగాటోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో తమ మ్యాచ్ విన్నింగ్ ఫాస్ట్ బౌలర్లు లేకుండానే ఆసీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతోంది.
కెప్టెన్ పాట్ కమిన్స్, హేజెల్‌వుడ్ గాయాలతో బాధపడుతుండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగాడు. అలాగే స్టోయినిస్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కమిన్స్ జట్టుకు దూరం కావడంతో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టులకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్క్ దూరం కావడం దెబ్బేనని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అంగీకరించాడు. కాగా, శ్రీలంకతో నేటి నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా స్టార్క్ దూరమయ్యాడు.
కొత్త కాంబినేషన్ తో ఈ మెగా టోర్నీలో ఆడబోతోంది. ఈ ఆటగాళ్లతో జట్టుగా అడ్జస్ట్ కావడానికి సమయం పడుతుంది. ఇక పేస్ బౌలింగ్ లోనూ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాగా పేస్ బౌలింగ్ లో కీలక ఆటగాళ్ళు దూరమవడం ఆసీస్ కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. వారి స్థానాల్లో ఎంపికైన సీన్ ఎబాట్ , నాథన్ ఎలిస్, పేస్ ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అయితే
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు బలంగా ఉంది బ్యాటింగే. సీనియర్ ఆటగాళ్లు స్మిత్, మ్యాక్స్ వెల్ తో పాటు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా స్మిత్ సంచలన ఫామ్ లో ఉన్నాడు. ఇక హెడ్ ఎంత డేంజరసో అందరికీ తెలుసు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అతను ఒంటిచేత్తో కంగారూ జట్టును గెలిపించాడు. కానీ పూర్తిస్థాయి బౌలింగ్ లేకుండా ఆస్ట్రేలియా ఏ మేర ముందుకెళుతుందనేది వేచిచూడాలి.