Steve Smith: యాక్టివ్ ప్లేయర్స్‌లో అత్యధిక సెంచరీలు..
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వయసు పైబడుతున్నా తనలో సత్తా తగ్గలేదని.. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.

Steve Smith holds the record for the most centuries in a Test career by a Test player
డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ మీద సెంచరీ చేసిన స్మిత్.. తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో కూడా శతకంతో చెలరేగాడు. గడిచిన 20 రోజుల వ్యవధిలో ఇంగ్లాండ్ గడ్డమీద స్మిత్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా టెస్టులలో స్మిత్‌కు ఇది 32వ సెంచరీ. ప్రస్తుతం 99వ టెస్టు ఆడుతున్న స్మిత్.. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 32 టెస్టులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌పై అతడికి ఇది 12వ సెంచరీ కావడం విశేషం.
ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌తో మినహా మిగిలిన దేశాలన్నింటిపైనా సుమారు 2 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేశాడు స్మిత్. ఆధునిక క్రికెట్‌లో ఫ్యాబ్ – 4గా పిలుచుకునే నలుగురు బ్యాటర్లలో స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలిమయ్సన్, విరాట్ కోహ్లీలో స్మిత్ టెస్టులలో అందరికంటే ఎక్కువ సెంచరీలు కలిగిఉన్నాడు. స్మిత్, 99 టెస్టులు 174 ఇన్నింగ్స్‌లలో 32 సెంచరీలు. రూట్, 132 టెస్టులు 240 ఇన్నింగ్స్ లలో 30 సెంచరీలు. కేన్ విలియమ్సన్, 94 టెస్టులు 164 ఇన్నింగ్స్‌లలో 28 సెంచరీలు. విరాట్ కోహ్లీ, 109 టెస్టులు 185 ఇన్నింగ్స్‌లలో 28 సెంచరీలు చేసి ఉన్నారు. ఓవరాల్ గా యాక్టివ్ ప్లేయర్స్ లో అత్యధిక సెంచురీలు కలిగి ఉన్న ఆటగాళ్లలో, విరాట్ కోహ్లీ 75 , జో రూట్ 46 , డేవిడ్ వార్నర్ 45 , స్టీవ్ స్మిత్ 44 , రోహిత్ శర్మ 43 సెంచురీలు కలిగి ఉన్నారు.