Sumit Nagal: కోహ్లీకి రుణపడి ఉంటా.. వైరల్‌గా యువ టెన్నిస్ ప్లేయర్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి తనకు అండగా నిలిచిందన్నాడు. గత రెండేళ్లుగా దారుణంగా విఫలమయ్యాననీ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాననీ చెప్పాడు. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా తనకు క్లారిటీ లేదన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2024 | 05:02 PMLast Updated on: Jan 17, 2024 | 5:02 PM

Sumit Nagal Thanks To Kohli For All Those Years Cherishes Kohli Support

Sumit Nagal: మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ కారణంగా క్రికెటర్లు భారీగా సంపాదిస్తూ ఉంటారు. స్టార్ క్రికెటర్ల ఆదాయం ఏడాదికి వందలాది కోట్లలో ఉంటుంది. అయితే తమ సంపాదనలో చాలా మంది ప్లేయర్స్ సామాజిక సేవకూ కొంత సహాయం చేస్తారు. ఇలా ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో కోహ్లీ (Virat Kohli) ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా కోహ్లీ గొప్ప మనసు మరోసారి అందరికీ తెలిసింది. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాయం చేశాడని భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ (Sumit Nagal) చెప్పాడు.

SINGER CHITRA: అయోధ్యపై సింగర్ చిత్ర పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వివాదం..

ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి తనకు అండగా నిలిచిందన్నాడు. గత రెండేళ్లుగా దారుణంగా విఫలమయ్యాననీ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాననీ చెప్పాడు. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా తనకు క్లారిటీ లేదన్నాడు. కెనడాలో ఓ టోర్నీ ముగిసిన తర్వాత జర్మనీకి ప్రయాణిస్తున్న సమయంలో తన వాలెట్‌లో కేవలం 6 డాలర్లు మాత్రమే ఉన్నాయనీ, ఇలాంటి పరిస్థితులను చాలా సార్లు ఎదుర్కొన్నట్టు గుర్తు చేశాడు. అథ్లెట్లకు అర్థిక సాయం అందిస్తేనే దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుందన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి మద్దతు పొందడం తన అదృష్టమని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ నగాల్ చెప్పుకొచ్చాడు.

ఇక ఏటీపీ టూర్‌లో పాల్గొనడానికి సుమారు రూ.కోటి అవసరమైన దశలో తన అకౌంట్‌లో 80 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో సుమీత్ నగాల్ సాధించిన విజయంతో అతనికి ఖాతాలో రూ.98 లక్షలు చేరాయి. అంతకుముందు క్వాలిఫై టోర్నీలో విజేతగా నిలిచినందుకు రూ.65 లక్షలు దక్కాయి. రెండో రౌండర్‌లో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్‌ను ఓడిస్తే రూ.1.40 కోట్లు ప్రైజ్ మనీగా వస్తాయి.