IPL Match: ముంబై చేతిలో చిత్తుగా ఓటమిపాలైన హైదరాబాద్ టీం..
ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ ఓటమి పాలైంది.
ముంబై విధించిన 193 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేక, సొంత గ్రౌండ్ లో చతికిలపడింది. లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన హ్యారీ బ్రూక్, ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగి, కేవలం 9 పరుగులకు ఔటయ్యాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చక్కటి టెస్టు ఇన్నింగ్స్ ఆడి, 41 బంతుల్లో 48 పరుగులు చేసాడు. ఇందులో కేవలం 4 ఫోర్లు ఒక్క సిక్సర్ మాత్రమే బౌండరీలుగా ఉన్నాయి. మయాంక్ ఇంకొంచం రెబెల్ గా ఆడితే మ్యాచ్ ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలిచేదే. ఇక రాహుల్ త్రిపాఠి కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
కెప్టెన్ ఐడెన్, అభిషేక్ శర్మలు లాస్ట్ మ్యాచులో దుమ్ములేపిన దానికి భిన్నంగా, ఒకరివెనుక ఒకరు పెవిలియన్ చేరి, గెలవాల్సిన మ్యాచులో, చేతులెత్తేశారు. ఒక్క హెన్రిక్ క్లాసేన్ ఒక్కడే, ముంబై జట్టుతో కబాడీ ఆడుకున్నాడు. క్లాసేన్ 16 బంతుల్లో 36 పరుగులు చేసి, ఆరెంజ్ ఆర్మీలో జోష్ ని తీసుకొచ్చాడు, కానీ, భారీ షాట్ కి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. క్లాసేన్ ఉంటే సన్ రైజర్స్ గెలుపు నల్లేరు మీద నడకే అయ్యేది. లోయర్ ఆర్డర్ కూడా పెద్దగా కష్టపడక పోయేసరికి, గెలవాల్సిన ఈక్వేషన్ ఉన్న మ్యాచులో 14 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. ఈ మ్యాచులో అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, క్రికెట్ ఫ్యాన్స్ అందరిచేత అప్లాజ్ అందుకున్నాడు. సన్ రైజర్స్ నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతో ఆడనుంది. ముంబై తదుపరి పోరు పంజాబ్ తో జరగనుంది.