Sunil Gavaskar: సెంచురీలు ఎవడికి ఉపయోగం హద్దులు బద్ధలవుతున్నాయా?
టీమిండియా వెస్టిండీస్ పర్యటనపై మరోసారి లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అసలు ఈ పర్యటనకు సీనియర్లను ఎందుకు సెలెక్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలెక్టర్లను తిట్టిపోశాడు.

Sunil Gavaskar expressed impatience with the selectors that what is the use of selecting senior players for the Test series against West Indies
ఈ సిరీసులో సీనియర్లు ఆడటం వల్ల లాభం ఏంటని నిలదీశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫెయిలైన సీనియర్లనే రెండు టెస్టులకు ఎలా ఎంపిక చేశారని అడిగాడు. ‘రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఫెయిలైన సీనియర్లను విండీస్‌తో టెస్టులకు ఎంపిక చేశారు. దీని వల్ల కొత్తగా ఏం తెలిసొచ్చింది? వాళ్లు భారీ స్కోర్లు చేస్తే ప్రయోజనం ఏంటి? కరీబియన్ దీవుల్లో వికెట్లు తీసుకుంటే లాభం ఏంటి? దీని వల్ల వాళ్ల వ్యక్తిగత రికార్డులు మెరుగవుతాయి అంతేకానీ.. జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా’ అని ఒక ప్రముఖ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో గవాస్కర్ మండిపడ్డాడు.
ఈ సిరీసులో కొంత మంది కుర్రాళ్లను ఎంపిక చేసి ఉంటే అది భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండేదని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే.. ప్రస్తుతం వెస్టిండీస్ అంత బలమైన జట్టు కాదని, అలాంటప్పుడు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందని అన్నాడు. ’70ల్లో రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఈ జట్టు.. వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవడానికి ఇప్పుడు జింబాబ్వేతో పోటీ పడే స్థితిలో ఉంది’ అని గుర్తుచేశాడు. అలాంటి టీంతో ఆడేందుకు కొందరు కుర్రాళ్లను ఎంపిక చేసి ఉంటే దాని వల్ల ఫ్యూచర్‌కు లాభం జరిగేదని సన్నీ చెప్పాడు. అలాగే వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడే సీనియర్లకు కూడా కొంత రెస్ట్ దొరికేదని, కనీసం వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు మరింత విశ్రాంతి ఇవ్వాల్సిందని సన్నీ అన్నాడు. అప్పుడు వాళ్లు ఫ్రెష్‌గా వరల్డ్ కప్ ఆడే వాళ్లని, గత ఆరు నెలలుగా చాలా బిజీ షెడ్యూల్‌లో ఉన్న వాళ్లకు ఈ రెస్ట్ చాలా ఉపయోగపడేదని తెలిపారు.