Hardik Pandya: ఇదేం కెప్టెన్సీ.. పాండ్యాపై గవాస్కర్ ఫైర్
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ఓ రేంజ్‌లో పాండ్యాపై ఫైరయ్యాడు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనంటూ సెటైర్లు వేశాడు. ఆర్డినరీ బౌలింగ్, ఆర్డినరీ కెప్టెన్సీ అంటూ విమర్శలు గుప్పించాడు.
Hardik Pandya: చెన్నైతో మ్యాచ్‌లో ముంబై సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు మాజీ క్రికెటర్లు. హార్ధిక్ కెప్టెన్సీని అత్యంత చెత్త కెప్టెన్సీగా అభివర్ణిస్తున్నారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ఓ రేంజ్‌లో పాండ్యాపై ఫైరయ్యాడు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనంటూ సెటైర్లు వేశాడు. ఆర్డినరీ బౌలింగ్, ఆర్డినరీ కెప్టెన్సీ అంటూ విమర్శలు గుప్పించాడు.
YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల
చెన్నైని 185కే కట్టడి చేయాల్సిందని, షెఫర్డ్‌తో రెండు ఓవర్లు ఎందుకు వేయించాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. గత మ్యాచ్‌లో అయిదు వికెట్లతో సత్తాచాటిన బుమ్రాకు నాలుగో ఓవర్లో బంతిని ఇవ్వడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. మళ్లీ బౌలింగ్ చేసేందుకు బుమ్రా మరో నాలుగు ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తిరిగి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. వరుసగా తన రెండు ఓవర్లు వేశాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా అతను కేవలం 6.75 ఎకానమీ రేటుతో 27 పరుగులే ఇచ్చాడని గుర్తు చేశాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూబె సిక్సర్లతో రెచ్చిపోతాడని మొత్తం పేసర్లతోనే హార్దిక్ బౌలింగ్ చేయించాడని. కానీ ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లోనూ అతను బౌండరీలు కొట్టాడన్నాడు. అలాంటప్పుడైనా బౌలింగ్‌లో మార్పులు చేయకపోవడం ఆశ్చర్యపరిచిందంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
ఇక హార్థిక్ బౌలింగ్‌పైనా గవాస్కర్ ఫైరయ్యాడు. చివరి ఓవర్లో లయ తప్పిన హార్దిక్.. ధోని సిక్సర్లు కొడుతుంటే చూస్తుండిపోయాడు. సారథిగా బౌలర్లను సరిగా వినియోగించుకోవడం లేదన్న విమర్శలను ఈ సీజన్ ప్రారంభం నుంచీ పాండ్యా ఎదుర్కొంటున్నాడు. అలాగే వ్యక్తిగతంగా పాండ్యా బౌలింగ్ కూడా అత్యంత పేలవంగా ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో చివరి ఓవర్లో పాండ్యా ఇచ్చిన 20 పరుగుల తేడాతోనే ముంబై పరాజయం పాలైంది.