Sunil Gavaskar: నువ్ గ్రేట్ కెప్టెన్.. అతడు గ్రేటెస్ట్ కెప్టెన్.. ఎవ్వరినీ వదలని సునీల్ గవాస్కర్
ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే.. అందరూ చాలా సింపుల్ గా ధోని పేరు చెప్పేస్తారు. నిజానికి ఈ విషయంలో పెద్దగా చర్చ కూడా జరగదు. ఒక్క టీమిండియా అభిమానులనే కాదు ప్రపంచంలో ఎవరిని అడిగిన ధోనిని కూల్ కెప్టెన్ నిస్సందేహంగా ఒప్పేసుకుంటారు.
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోని జట్టుని ముందుండి నడిపించడంలో ధోని తర్వాతే ఎవరైనా. అంతే కాదు ప్లేయర్లు భారీగా పరుగులు ఇచ్చినా ఏనాడు తన సహనాన్ని కోల్పోలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ లో కొనసాగుతున్న ధోని ఇప్పటివరకు కోపం తెచ్చుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. కెప్టెన్ గా ధోనిని మించిన వారున్నా.. కూల్ గా ఉండడంలో మాత్రం తనకు తానే సాటి. అయితే ధోని కంటే మరో కూల్ కెప్టెన్ ఉన్నారంటూ భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని దగ్గరకు వచ్చి సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న సంగతి తెలిసిందే.
ఒక దిగ్గజ క్రికెటర్ అయినా కూడా చిన్న పిలాడిలా ధోని దగ్గరకి వెళ్లి ఇలా తన షర్ట్ మీద ధోని సంతకం చేయడం టోర్నీ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. దీని బట్టి ధోనీకి సునీల్ గవాస్కర్ ఎంత పెద్ద అభిమానో అర్ధం అవుతుంది. ధోనిని మించిన కెప్టెన్ లేడంటూ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పడు మాత్రం మహీ కంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూల్ కెప్టెన్ అంటున్నాడు. టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్ గెలిచి ఇటీవలే 40 సంవత్సరాలు పూరీతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కెప్టెన్ కపిల్ దేవ్ ని ప్రశంసించాడు.
“భారత్ కి తొలి ప్రపంచ కప్ ను అందించిన కపిల్ దేవ్ అసలైన కూల్ కెప్టెన్. కపిల్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తీరు అమోఘం. ఆ క్యాచ్ మేమియు వరల్డ్ కప్ అందుకునేలా చేసింది. ఒక ప్లేయర్ క్యాచ్ వదిలేసినా, మిస్ ఫీల్డ్ చేసినా కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఇలా ఉండడం చాలా కష్టం. అతడు ఒక డైనమిక్ ప్లేయర్. లీడర్ షిప్ క్వాలిటీస్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అని గవాస్కర్ తెలియజేసాడు. మొత్తానికి ధోని ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చాడు లెజెండరీ గవాస్కర్.