Ravichandran Ashwin: రోహిత్ కెప్టెన్సీ అతనికిస్తే బాగుంటుంది.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ చెప్పాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు.
Ravichandran Ashwin: ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరగనున్న చివరి టెస్టులో భారత జట్టును సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నడిపించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తన కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయికి చేరుకుంటున్న అశ్విన్‌కు గౌరవంగా ఇది చేయాలని సూచించాడు. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నట్లు గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ అశ్విన్ కెరీర్‌లో 99వ టెస్టు కానుంది.
K Nageshwar Rao : చంద్రబాబు నాయుడు మరీ లోబడి వ్యవహరిస్తున్నారా.?
ఇప్పట్లో మళ్లీ టెస్ట్ సిరీస్ లేకపోవడంతో అతన్ని గౌరవిస్తూ రోహిత్ సారథ్య బాధ్యతల అప్పగించాలన్నది గవాస్కర్ సలహా. ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ చెప్పాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు. భారత క్రికెట్‌కు తాను చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం దక్కాలని అశ్విన్‌తో గవాస్కర్ పేర్కొన్నాడు.
గవాస్కర్ వ్యాఖ్యలతో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఏకీభవించాడు. దానికి రవిచంద్రన్ అశ్విన్ హుందాగా బదులిచ్చాడు. నిజం చెప్పాలంటే.. టీమిండియాతో కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నాననీ, జట్టుతో ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటానన్నాడు. కెప్టెన్సీపై ఆశలు లేవని ఇలా పరోక్షంగా యాష్ వ్యాఖ్యానించాడు.