Sunil Narine : సునీల్ నరైన్ అరుదైన రికార్డు
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు.

Sunil Narine is a rare record
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
2012 తన డెబ్యూ సీజన్‌లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్‌లో.. తాజాగా 2024 సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్‌లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో నరైన్ ఒక సెంచరీ, 3 అర్దసెంచరీలు చేశాడు.