KAVYA MARAN: నెట్ వర్త్‌లో దూసుకెళుతున్న కావ్య పాప.. ఆమె సంపద ఎంతో తెలుసా..?

క్రికెట్ ఫ్యాన్స్ ముద్దుగా కావ్య పాపగా పిలుచుకునే ఆమె ఇటీవల ముగిసిన మినీ వేలంలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 07:55 PMLast Updated on: Dec 25, 2023 | 7:55 PM

Sunrisers Hyderabad Franchise Owner Kavya Marans Net Worth

KAVYA MARAN: కావ్యా మారన్.. ఐపీఎల్ చూసే క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. స్టార్ ప్లేయర్స్ తరహాలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న ఈమె సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్. కావ్య మారన్‌ను చూసేందుకే మైదానాలకు వచ్చే అభిమానులున్నారు. బ్యాటర్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించడంతో బాగా ఫాలోయింగ్ వచ్చేసింది.

Rohit Sharma: ముంబై కాకుంటే నేను ఆడే జట్టు ఇదే.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

గెలిచినప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ముద్దుగా కావ్యా పాపగా పిలుచుకునే ఆమె ఇటీవల ముగిసిన మినీ వేలంలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కేవలం ఐపీఎల్ సమయంలోనే కనిపించే కావ్య మారన్ సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు. బిజినెస్ మీద ఆసక్తితో ఎంబీఎ చేసిన ఆమె వ్యాపార రంగంలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తనదైన ముద్ర వేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. తన తండ్రి బిజినెస్‌ల్లోని సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ను చూసుకుంటుంది.

త్వరలో సన్‌గ్రూప్‌ను కూడా టేకప్ చేయబోతుంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ సన్ రైజర్స్ టీమ్ వ్యవహారాలను సమర్థవంతంగా డీల్ చేస్తున్న కావ్య తనకున్న బిజినెస్ మైండ్‌తో నెట్ వర్త్ లోనూ దూసుకుపోతోంది. తాజాగా ఓ మ్యాగ్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం కావ్యా మారన్ నెట్ వర్త్ వాల్యూ 409 కోట్ల పైనే ఉంది. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ నెట్ వర్త్ 19వేల కోట్లుగా ఉంటే.. తండ్రికి తగ్గట్టే కావ్యా పాప కూడా దూసుకుపోతోందని బిజినెస్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.