Sunrisers Hyderabad: ఆకాశమే హద్దుగా ఆరేంజ్ ఆర్మీ.. టాప్ ప్లేయర్లతో బలంగా మారిన జట్టు
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ప్రస్తుతం అన్ని రంగాల ఆటగాళ్లతో ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తోంది. రూ.34 కోట్లతో వేలంలోకి ప్రవేశించిన ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ.. అగ్రశ్రేణి ఆటగాళ్ల సేవలను వినియోగించుకునేందుకు వేలంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అద్భుతమైన ఆట కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 2024 వేలంలో షాకింగ్ బిడ్డింగ్‌లతో కీలక ప్లేయర్లను స్వ్కాడ్‌లో చేర్చుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ప్రస్తుతం అన్ని రంగాల ఆటగాళ్లతో ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తోంది. రూ.34 కోట్లతో వేలంలోకి ప్రవేశించిన ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ.. అగ్రశ్రేణి ఆటగాళ్ల సేవలను వినియోగించుకునేందుకు వేలంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మిస్సింగ్.. ఫోన్ స్విచ్ఛాఫ్..
హైదరాబాద్ జట్టులో కేవలం ఆరు స్లాట్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో, సన్‌రైజర్స్ జట్టు చాలా తెలివిగా నడుచుకుంది. IPL 2024 వేలానికి ముందు, సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అనుభవజ్ఞులైన, టీ20ల్లో సత్తా చాటగలిగే యువ ప్రతిభతో నిండి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లతోపాటు అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన యువకులను రిటైన్ చేసుకుంది. అలాగే, యువ ప్రతిభకు పట్టం కట్టడంలోనూ ముందుటామంటూ నిరూపించుకుంది. హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో పాటు, హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్ వంటి ఆటగాళ్లకు జట్టు వీడ్కోలు పలికింది. ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ రూ.6.80 కోట్లు పలికాడు. అదే విధంగా, వనిందు హసరంగా రూ.1.5 కోట్లు, పాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు, జయదేవ్ ఉనద్కత్ 1.60 కోట్లు, ఆకాష్ సింగ్ 20 లక్షలు, జాతవేద్ సుబ్రమణ్యన్ రూ.20 లక్షలతో సన్ రైజర్స్ జట్టులో చేరిపోయారు.