SRH, IPL : ఆరెంజ్ ఆర్మీ సరికొత్త చరిత్ర…
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్యచేధనలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

Sunrisers Hyderabad team created history in IPL.
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్యచేధనలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే 100 ప్లస్ లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలి ఉండగా చేధించిన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా పవర్ ప్లేలో రెండు సార్లు 100 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ రెండు సార్లు పవర్ ప్లేలో 100 ప్లస్ పరుగులు చేసింది. ఐపీఎల్‌లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ రికార్డు సాధించింది. ఈ భారీ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో పాయింట్లలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. రన్‌రేట్ కూడా భారీగా మెరుగుపడింది.