SRH, Pat Cummins : కమిన్స్ గొప్ప మనసు
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం హోం గ్రౌండ్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

Sunrisers Hyderabad, who have reached the play-offs in the 17th season of IPL, will play their last league match at their home ground on Sunday.
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం హోం గ్రౌండ్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే సన్ రైజర్స్‌ను ప్లే ఆఫ్స్ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్ సాబ్.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. కమిన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్ అతడిని 20.50 కోట్లకు కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది.