టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్, రిటైర్మెంట్ పై తేల్చేసిన కోహ్లీ
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్... తన రిటైర్మెంట్ పై కింగ్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పట్లో రిటరయ్యే అవకాశం లేదని చెప్పేశాడు.

King Kohli
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్… తన రిటైర్మెంట్ పై కింగ్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పట్లో రిటరయ్యే అవకాశం లేదని చెప్పేశాడు. తన తర్వాతి టార్గెట్ ఏంటో కూడా విరాట్ వెల్లడించాడు. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ , ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన కోహ్లీ ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. 2027 ప్రపంచ కప్ గెలవడమే తన ముందున్న టార్గెట్ అని ఒక షో సందర్బంగా విరాట్ కోహ్లీ తన లక్ష్యాన్ని రివీల్ చేశాడు. తదుపరి వన్డే ప్రపంచకప్ గెలవాలని చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఓ ప్రైవేట్ ఈవెంట్ మీ తదపరి లక్ష్యం ఏంటి.. అసలేం చేయబోతున్నారు.. పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ పై విధంగా స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ తదుపరి ఎడిషన్ 2027లో దక్షిణాఫ్రికాలో జరగనుంది.
2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను భారత్ తృటిలో చేజార్చుకుంది. ఓటమే లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన టీమిండియా టైటిల్ పోరులో ఆసీస్ చేతిలో ఓడిపోయి కా రన్నరప్ తో సరిపెట్టుకుంది. అప్పటి ఎడిషన్ లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. 11 మ్యాచ్ లలో 95.62 సగటుతో రికార్డు స్థాయిలో ఏకంగా 765 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. కోహ్లీ రికార్డు స్కోరింగ్ లో మూడు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. కానీ ఫైనల్ లో భారత్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పటి నుంచి సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తదుపరి ప్రపంచ కప్ వరకు వన్డేలు ఆడటం కొనసాగిస్తారా అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. మధ్యలో ఫామ్ కోల్పోవడంతో కోహ్లీ, రోహిత్ వచ్చే వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు.,
కాగా ప్రస్తుతం 2027 వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడుతానని ప్రకటన చేయడంతో…. టీమిండియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కోహ్లీ ఆడితే కచ్చితంగా టీమిండియా చాంపియన్ అవుతుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం 2027 ప్రపంచకప్ వరకు విరాట్, రోహిత్ లు తమ కెరీర్ ను కొనసాగించడానికి దాదాపు లైన్ క్లియరయినట్టే. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ మరోసారి మంచి ఫామ్ లో కనిపించాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియాలపై మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఫైనల్లో రోహిత్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.