Suresh Raina: రిటైర్మెంట్ వరకు మాట దాటలేదు సెన్సేషన్స్ బయటపెట్టిన సురేష్ రైనా
ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న 'హోమ్ ఆఫ్ హీరోస్' ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్‌లో తనకు చాలా జట్లు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాయని, ధోనీ చెప్పిన మాటతో వాటన్నింటినీ వదులుకున్నానని తెలిపాడు.

Suresh Raina, who participated in the 'Home of Heroes' program hosted by Akash Chopra, shared an interesting fact about Dhoni
‘దేశవాళీ క్రికెట్‌లో నేను ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించా. ధోనీ గైర్హాజరీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా నడిపించా. చెన్నై టీమ్ సస్పెన్షన్‌కు గురైనప్పుడు గుజరాత్ లయన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించా. దాంతో ఐపీఎల్‌లో చాలా టీమ్స్ కెప్టెన్సీ ఆఫర్స్ ఇచ్చాయి. అయితే ధోనీ భాయ్ మాత్రం నన్ను జట్టును విడిచి పోవద్దని చెప్పాడు.
తాను చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నంత కాలం.. నువ్వే వైస్ కెప్టెన్‌గా ఉంటావని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నేను జట్టులో ఉన్నన్నీ రోజులు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. అందుకే ఇతర జట్లు ఇచ్చిన ఆఫర్స్‌ను వదులుకున్నా. కెప్టెన్ అవ్వాలని ఏనాడు ఆశపడలేదు. నేనెప్పుడూ జట్టు ప్లేయర్‌గానే ఉన్నాను. నా టీమ్ సహచర ఆటగాళ్లకు అవసరమైన సాయం చేయడం.. వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు ఏం చేయాలో ఆలోచించడం మాత్రమే నాకు తెలుసు. పదవులు కోరుకోలేదు. అని రైనా చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా సురేశ్ రైనాకు ధోనీ అండగా నిలిచాడు. సురేశ్ రైనా కూడా ధోనీ మాట కాదనలేదు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తొలి మూడు టైటిళ్లలో సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు. ధోనీ తర్వాత చిన్న తాలాగా చెన్నై ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణంలో శ్రీరాముడికి హనమంతుడికి ఉన్న బంధం.. మహాభారతంలో కృష్ణా-అర్జున మధ్య ఉన్న రిలేషన్ కంటే గొప్పదని వారి ఫ్యాన్స్ కామెంట్ చేస్తుంటారు.