Surya bhai’s : సూర్యా భాయ్ రికార్డుల జోరు…
ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తిరిగి గెలుపు బాట పట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

Surya bhai's record breaking...
ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తిరిగి గెలుపు బాట పట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో అదరగొట్టాడు.ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (Rohit Sharma) తో కలిసి చరిత్రకెక్కాడు. ఐపీఎల్ (IPL) లో ముంబై తరఫున సూర్య, రోహిత్ రెండు శతకాలు సాధించారు. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సనత్ జయసూర్య, సైమన్స్, కామెరూన్ గ్రీన్ తలో సెంచరీ బాదారు. అంతేగాక సూర్య మరో ఘనత సాధించాడు. టీ20 (T20) ల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్‌తో కలిసి సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లి తొమ్మిది సెంచరీలు చేయగా..రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఎనిమిది; రుతురాజ్, రాహుల్, సూర్య తలో ఆరు సార్లు శతక్కొట్టారు.