NCAలో సూర్యాభాయ్ దులీప్ ట్రోఫీకి దూరం
టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు.

suryakumar yadav
టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నీ ఆడుతూ గాయపడిన సూర్యకుమార్ ను ఎన్సీఎ మెడికల్ టీమ్ పరీక్షించనుంది. చేతికి గాయం తీవ్రతను అంచనా వేసి ట్రీట్ మెంట్ కు రిఫల్ చేయనుంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీకి సూర్యుకమార్ దూరమయ్యాడు. అలాగే టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఈ హిట్టర్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. తాజా గాయంతో బంగ్లాదేశ్ తో సిరీస్ కు జట్టు ఎంపికలో సూర్యకుమార్ ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు. ఇప్పటికే టెస్ట్ జట్టులో ప్లేస్ కోసం పలువురు యువక్రికెటర్లు రేసులో ఉండగా.. సూర్యకుమార్ ను టీ ట్వంటీలకే పరిమితం చేసే అవకాశముంది.