Suryakumar Yadav: విరాట్ రికార్డుపై సూర్య కుమార్ యాదవ్ కన్ను..
సూర్య మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేయడం కష్టం కాబట్టి సూర్య ఉన్న ఫామ్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌పై కన్నేశాడు.

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. సంవత్సరం నుంచి ఈ పేరు ట్రెండింగ్‌లో ఉంది. వన్డే, టెస్టు ఫార్మాట్‌లను పక్కన పెడితే టీ20ల్లో సూర్యను మించిన ఆటగాడు మరొకడు ఉండడమో అనే అనుమానం కలుగుతుంది. వేగంగా ఆడటంతో పాటు నిలకడగా పరుగులు చేయడం ఈ 33 ఏళ్ళ బ్యాటర్ స్పెషాలిటీ. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా అలవోకగా బౌండరీలు కొట్టేస్తాడు. టీ20 స్పెషలిస్టుగా పేరొందిన సూర్య ఇప్పుడు పాక్ ప్లేయర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ రికార్డుపై కన్నేశాడు.
Gautam Gambhir: నాకు అతడితో బ్యాటింగ్ చేయడం ఇష్టం: గౌతమ్
ప్రస్తుతం సూర్య 50 ఇన్నింగ్స్‌లలో 1841 పరుగులు చేసాడు. మరో 159 పరుగులు చేస్తే 2000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డ్ పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల పేరిట ఉంది. వీరిద్దరూ 52 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు. సూర్య మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో 159 పరుగులు చేస్తే వీరిద్దరి రికార్డ్ సమం చేస్తాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేయడం కష్టం కాబట్టి సూర్య ఉన్న ఫామ్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌పై కన్నేశాడు.
భారత్ తరపున విరాట్ 56 ఇన్నింగ్స్‌ల్లో 2000 టీ20 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో 5 ఇన్నింగ్స్‌ల్లో ఈ ముంబై బ్యాటర్ 159 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ 20ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. మరి వీటిలో ఏ రికార్డ్ సూర్య బద్దలు కొడతాడో చూడాలి.