Suryakumar Yadav: సూర్య 4 సిక్సర్లు.. విరాట్ రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో 6వ నంబర్‌ ఆటగాడిగా మైదానంలోకి దిగిన సూర్య.. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా కెమరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సర్లు బాదాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 04:56 PMLast Updated on: Sep 25, 2023 | 4:56 PM

Suryakumar Yadav Hits 4 Back To Back Sixes Off Cameron Green In 2nd Odi

Suryakumar Yadav: ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలో భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 6వ నంబర్‌ ఆటగాడిగా మైదానంలోకి దిగిన సూర్య.. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా కెమరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సర్లు బాదాడు. తొలి బంతిని ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ లైన్ దాటించి సిక్స్ బాదగా, రెండో బంతికి తన మార్క్ స్కూప్ షాట్ ఆడి అదే దిశగా బంతిని బౌండరీ లైన్ దాటించాడు.

మూడో బంతిని ఎక్స్ ట్రా కవర్స్ మీదుగా పవర్ ఫుల్ షాట్ కొట్టాడు. నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. ఇలా.. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు స్కై.అంతే కాకుండా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. విశేషమేమిటంటే, ఈ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి కింగ్ కోహ్లీ పేరిట ప్రత్యేక రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా స్కోరు 399కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే శుభ్‍మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలు చేసి ఔటవటంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి విశ్వరూపం చూపాడు. నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్‌తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.