Surya Kumar yadav: ముంబై ఇండియన్స్‌కు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ డౌటే
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. స్కై ఇటీవల తన ఫిట్‌నెస్‌ను రివీల్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ.. వాటిలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడలేదు.

Surya Kumar yadav: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న స్కై.. ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువేనని ముంబై ఇండియన్స్ వర్గాల సమాచారం.
JaiBheem Bharath Party: జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలోకి.. దీని వెనక బాబు స్కెచ్ ఉందా..?
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. స్కై ఇటీవల తన ఫిట్‌నెస్‌ను రివీల్ చేస్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ.. వాటిలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడలేదు. దీంతో అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదన్న విషయం స్పష్టమైంది. టీ ట్వంటీ ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన సూర్య కుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైతే ముంబైకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే సూర్య పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్‌తో ఆడనుంది.