Suryakumar Yadav: సూర్యా భాయ్ సరికొత్త చరిత్ర.. రెండోసారి ఐసీసీ టీ20 అవార్డు
సూర్యకుమార్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా, అల్పేష్ రమ్‌జాని, మార్క్ చాప్‌మన్ పోటీపడ్డారు.

Suryakumar Yadav: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును వరుసగా రెండోసారి అందుకున్నాడు. 2023లో పరుగుల వరద పారించిన సూర్యను టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో సూర్యకుమార్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఈ అవార్డును రెండుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.
India vs England: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
ఈ అవార్డు కోసం సూర్యతో పాటు సికందర్ రజా, అల్పేష్ రమ్‌జాని, మార్క్ చాప్‌మన్ పోటీపడ్డారు. కానీ వీళ్లందరినీ వెనక్కి నెట్టి సూర్య అవార్డు గెలుచుకున్నాడు. గత ఏడాది సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్‌లలో 48 సగటుతో 733 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, అంతకుముందు 2022 ఏడాదిలోనూ ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. మరోవైపు ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది.
హెర్నియా సమస్యకు ఇటీవల జర్మనీలో సర్జరీ చేయించుకున్న సూర్య కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఐపీఎల్ ప్రారంభ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయినా టీ20 ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటాడు.