విండీస్ దే రెండో టీ ట్వంటీ సిరీస్ కైవసం

కరేబియన్ టూర్ లో సౌతాఫ్రికా జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 26, 2024 | 04:33 PMLast Updated on: Aug 26, 2024 | 4:33 PM

T20 Series 2 Won By West Indies

కరేబియన్ టూర్ లో సౌతాఫ్రికా జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ ఆ జట్టు ఓడిపోయింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ విండీస్ 30 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 179 పరుగులు చేసింది. హోప్ , పావెల్, షెపార్డ్ రాణించారు. ఛేజింగ్ లో సౌతాఫ్రికాకు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు హెండ్రిక్స్, రికెల్టన్ 4.3 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా సౌతాఫ్రికా 149 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్‌కు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. షెపార్డ్ 3 కీలక వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించాడు.