T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక.. హార్దిక్‌కు చోటు..!
ఈ మెగా టోర్నీకి సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కూడా ఎంపిక చేశారు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కూడా జట్టులో చోటు దక్కింది.
T20 World Cup 2024: జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీకి సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కూడా ఎంపిక చేశారు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కూడా జట్టులో చోటు దక్కింది.
BRS 12 seats: 12 సీట్లతో ఏం పొడుస్తారు..? కేసీఆర్ మళ్ళీ చక్రం తిప్పుతారా..?
హార్ధిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఏడాదిన్నరగా ఆటకు దూరమై.. ఇటీవల ఐపీఎల్‌లో అదరగొడుతున్న వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్‌ను కూడా ఎంపిక చేశారు. దీంతో రిషబ్ అంతర్జాతీయ టోర్నీలోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు. తాజా ఐపీఎల్‌లో అదరగొడుతున్న చెన్నై బ్యాటర్ శివం దూబేకు జట్టులో చోటు దక్కింది. చాహల్ కూడా మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌ను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. అమెరికా, వెస్టిండీస్‌లలో ఈ టోర్నీ జరుగుతుంది.
జట్టు సభ్యులు వీళ్లే:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్