T20 WORLD CUP: టీ20 వరల్డ్ కప్.. 10 మంది ఫిక్స్.. మిగిలిన ఐదుగురు ఎవరు..?

ఇప్పటికే 10 మందికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందని.. వాళ్లు కరీబియన్ దీవులకు వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ రవీంద్ర జడేజా ప్రపంచ కప్ జట్టులో ఉండటం పక్కా అని చెప్పొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 02:23 PMLast Updated on: Apr 21, 2024 | 2:23 PM

T20 World Cup Probables Team India Selection Is Going On

T20 WORLD CUP: టీ ట్వంటీ వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ నెలాఖరులోగా అన్ని దేశాలు తమ జట్ల జాబితాను ఐసీసీకి అందజేయాలి. దీంతో భారత్ జట్టు ఎంపిక కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం భేటీ కానుంది. మెగా టోర్నీకి వెళ్ళే జట్టులో చోటు కోసం సీనియర్ల నుంచి జూనియర్ల వరకు చాలా మంది ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. తమకు టీమ్లో ప్లేస్ దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు.

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ.. కీలక విషయాలు చెప్పిన నిర్మాత

అయితే ఇప్పటికే 10 మందికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందని.. వాళ్లు కరీబియన్ దీవులకు వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ రవీంద్ర జడేజా ప్రపంచ కప్ జట్టులో ఉండటం పక్కా అని చెప్పొచ్చు. వీళ్లతో పాటు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్‌లో అదరగొడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా పొట్టి కప్పులో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారని టాక్ నడుస్తోంది. అయితే.. ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ఐపీఎల్‌లో అత‌డు రాణించేదాన్ని బ‌ట్టి అత‌డి ఎంపిక ఆధార‌ప‌డి ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో రాణిస్తేనే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ఉంటుంద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇప్ప‌టికే హార్దిక్‌కు అందిన‌ట్లు తెలుస్తోంది. మిగిలిన అయిదు స్థానాల కోసం రేసులో పలువురు యువ, సీనియర్ ప్లేయర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ ప్లేయర్స్ పైనా సెలక్టర్ల దృష్టి పెట్టినట్టు సమాచారం. ఓపెనింగ్ బ్యాకప్ స్లాట్ కోసం యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్‍లో టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఒకవేళ వారిద్దరినీ తీసుకోవాలంటే శివం దూబే, రింకూ సింగ్‍లో ఒకరిని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అయితే, భారీ హిట్టింగ్‍తో మెరిపిస్తున్న దూబే, రింకూ ఇద్దరికీ టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ప్లేస్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక, ఐపీఎల్‍లో అదరగొడుతున్న సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍పై కూడా సెలెక్టర్లు చర్చించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరనే విషయంలోనూ ఉత్కంఠ ఉంది.