టీసీ టూ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ధోనీ కథే ఒక స్ఫూర్తి
భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కెప్టెన్ గా నిలిచిన ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించాడు. రాంఛీలో పుట్టిన ధోనీ బ్యాక్ గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే... తండ్రి పాన్ సింగ్ ధోనీ పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారు.
భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కెప్టెన్ గా నిలిచిన ధోనీ దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించాడు. రాంఛీలో పుట్టిన ధోనీ బ్యాక్ గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే… తండ్రి పాన్ సింగ్ ధోనీ పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారు. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకుంటే ధోనీ మాత్రం క్రికెట్ వైపు ఆకర్షితుడయ్యాడు. మొదట్లో ఫుట్ బాల్ గోల్ కీపర్ గా ఉన్న మహి తర్వాత కోచ్ సలహాతో వికెట్ కీపర్ గా మారాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ధోనీ తర్వాత క్రికెట్ నే పూర్తిస్థాయి కెరీర్ గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఎదిగాడు. క్రికెట్ లోకి వచ్చే యువ ఆటగాళ్ళకు ధోనీ కెరీర్ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనేది చాలా మంది మాట.