Venkatesh Iyer : కౌంటీ క్రికెట్ ఆడనున్న అయ్యర్..
టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ రీఎంట్రీపై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చిన ఈ ఆల్ రౌండర్ కొద్దికాలంలోనే చోటు కోల్పోయాడు.
టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ రీఎంట్రీపై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చిన ఈ ఆల్ రౌండర్ కొద్దికాలంలోనే చోటు కోల్పోయాడు. హార్థిక్ పాండ్యా రాకతో సెలక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు టెస్ట్ జట్టులో ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్న వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా లాంక్ షైర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన అయ్యర్ గత నాలుగు సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. భారత్ తరపున 9 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 2022లో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. కౌంటీ క్రికెట్ తర్వాత దులీప్ ట్రోఫీలోనూ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.